English   

త‌మ‌న్నా కంటే కాజ‌ల్ కే ఆహా అనిపించే రెమ్యున‌రేష‌న్

 Kajal
2021-05-20 17:00:27

ప్ర‌స్తుతం ఓటీటీ ల హ‌వా న‌డుస్తుంది. అప్ క‌మింగ్ యాక్ట‌ర్స్ మాత్ర‌మే కాకుండా స్టార్ హీరో హీరోయిన్ లు సైతం డిజిట‌ల్ ఫ్లాట్ ఫాం పై మెరిసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇప్టిటికే ప‌లువురు ప‌లువురు స్టార్ లు ఓటీటీలోకి అడుగుపెట్టగా మ‌రికొంద‌రు కూడా రెడీ అవుతున్నారు. ఇక తెలుగు వారి ఓటీటీ ఆహా కూడా ఓటీటీ రంగంలో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్ ల‌తో వెబ్ సిరీస్ ల‌ను తెర‌కెక్కిస్తోంది. ఆహా ఇప్ప‌టికే స‌మంతతో ఓ టాక్ షో చేసి ఆహా అనిపించిది. అంతే కాకుండా త‌మన్నా తో లెవ‌న్త్ అవ‌ర్ అనే వెబ్ సిరీస్ ను తెర‌కెక్కించింది. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం త‌మ‌న్నాకు నిర్మాత అల్లు అర‌వింద్ 2 కోట్ల వ‌ర‌కూ రెమ్యున‌రేష‌న్ ను ఇచ్చార‌ట‌. త‌మ‌న్నా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న సమ‌యంతో అరవింద్ ఒప్పించార‌ట‌. దాంతో డేట్స్ స‌ర్దుబాటు చేసుకుని త‌మ‌న్నా లెవ‌న్త్ అవ‌ర్ లో న‌టించింది. 

ఇక ఇప్పుడు అందాల చంద‌మామ కాజల్ అగ‌ర్వాల్ కూడా ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేయ‌బోతుంద‌ట‌. కాజల్ ఇప్ప‌టికే లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో మాత్రం కాజ‌ల్ అగ‌ర్వాల్ విఫ‌లం అయింది. దాంతో వెబ్ సిరీస్ లు చేయ‌కూడ‌ద‌ని కాజ‌ల్ డిసైడ్ అయింద‌ట కానీ అల్లు అరవింద్ రిక్వెస్ట్ తో ఆహా కోసం ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఒప్పుకుంద‌ట‌. అంతే కాకుండా త‌మ‌న్నాకు 2 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌గా కాజ‌ల్ కు 2 కోట్ల కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు అల్లు అర‌వింద్ ఒప్పుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ను ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు టాక్. 

More Related Stories