English   

బెల్లంకొండ క్రేజీ ప్రాజ‌క్టు కోసం శ్రీకాంత్ అడ్డాల‌

Srikanth Addala
2021-05-20 17:53:22

త‌మిళ సూప‌ర్ స్టార్ ద‌నుష్ హీరోగా న‌టించిన క‌ర్న‌న్ సినిమా ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విమ‌ర్ష‌కుల ప్ర‌శంస‌లు అందాయి. దాంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా మంది పోటీప‌డ్డారు. కానీ చివ‌ర‌గా తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ద‌క్కించుకున్నారు.  దాంతో ఈ సినిమాను ఎవ‌రు తెర‌కెక్కిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. అయితే తాజా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ప్ర‌కారం ఈ చిత్ర రీమేక్ కోసం ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌ను అనుకుంటున్నార‌ట‌. శ్రీకాంత్ అడ్డాల ప్ర‌స్తుతం వెంక‌టేశ్ హీరోగా అసుర‌న్ రీమేక్ ను తెర‌కెక్కిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో త‌మిళ సినిమా రీమేక్ చేయ‌డంతో ఆయ‌న‌కు గ్రిప్ ఉంద‌ని భావించిన నిర్మాత‌లు క‌ర్న‌న్ రీమేక్ ను కూడా ఆయ‌న చేతిలో పెట్టాల‌ని భావిస్తున్నార‌ట‌. దాంతో శ్రీకాంత్ ఈ సినిమా రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా లేదా అన్న‌ది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండ‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం చ‌త్రప‌తి రీమేక్ లో న‌టిస్తున్నారు. తెలుగులో సూప‌ర్ హిట్ గా నిలిచిన చ‌త్ర‌ప‌తిని బెల్లంకొండ బాలీవుడ్ కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఇక సినిమా పూర్తి చేసిన త‌ర‌వాత క‌ర్న‌న్ రీమేక్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది.

More Related Stories