English   

ఎన్టీఆర్ పోస్టర్ల పై అభిమానుల ఆగ్రహం

Jr NTR
2021-05-21 11:24:25

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్, ఎన్టీఆర్30 నుండి ఈరోజు పోస్టర్లు విడుదల చేసారు. అయితే రెండు సినిమాల పోస్టర్ల పైనా అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ పోస్టర్ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు దర్శకుడు రాజమౌళి పోస్టర్ ను విడుదల చేయగా తీవ్రంగా నిరాశ చెందారు. దానికి కారణం పోస్టర్ చాలా సింపుల్ గా ఉండటమే. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఎన్టీఆర్ లుక్ మాత్రం మాములుగానే కనిపించింది. పంచ కట్టులో నల్ల కుర్తా ధరించి ఎన్టీఆర్ కనిపిస్తుతున్నారు. ఇక చేతిలో ఒక బల్లెం కనిపిస్తోంది. దాంతో ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ఇలా సింపుల్ పోస్టర్ ను వదిలారు అంటూ ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ 30 పోస్టర్ కూడా అలాగే ఉంది. ఎన్టీఆర్ ఇన్ షెట్ వేసుకుని సింపుల్ గా నవ్వుతూ కనిపిస్తున్నారు. అసలు సినిమా పోస్టర్ లానే కనిపించడం లేదు. ఎదో వదలాలి అని వదిలినట్టుంది. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ పోస్టర్ తో కూడా తీవ్ర నిరాశ చెందారు. అసలు ఇది పోస్టర్ ఏనా అంటూ ప్రశ్నిస్తున్నారు.

More Related Stories