English   

బంగార్రాజు కోసం హాట్ బ్యూటీ

Payal Rajput
2021-05-21 11:31:20

ప్రస్తుతం రాబోతున్న సీక్వెల్స్ లో ఎన్నో అంచనాలు ఉన్న సినిమా బంగార్రాజు. సోగ్గాడే చిన్ని నాయినా చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కూడా నాగార్జున హీరోగా నటీసీతుండగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నాగార్జునతో పాటు అఖిల్, నాగ చైతన్య సమంత కూడా నటిస్తున్నారని రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారట. అంతే కాకుండా అనూప్ ఈ చిత్రం కోసం ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ను కంపోస్ చేశారట. అయితే ఈ సాంగ్ కోసం స్టెప్పులు వేయడానికి మేకర్స్ ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ ను సంప్రదించారట. ఒకవేళ పాయల్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓ మాంచి సాంగ్ తో అభిమానులకు పండగే.

More Related Stories