English   

ఓటీటీకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్

Akhil
2021-05-21 11:37:33

ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌న‌తో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల‌న్నీ విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నాయి. అంతే కాకుండా ఫ‌స్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇప్ప‌ట్లో థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ప‌లు చిత్రాల‌కు ఓటీటీ నుండి మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే అన‌సూయ లీడ్ రోల్ చేసిన థాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసారు. అంతే కాకుండా ఏక్ మినీ క‌థ కూడా ఓటీటీలో విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

మ‌రోవైపు రానా విరాట‌ప‌ర్వం, నాని ట‌క్ జ‌గ‌ధీశ్ సినిమాల‌కు కూడా ఆఫర్లు వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఆ లిస్ట్ లో అకిల్ హీరోగా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా చేరిపోయింది. ఈ సినిమాను పేప‌ర్ వ్యూ విధానంతో విడుద‌ల చేయ‌బోతున్నట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ కు చెందిన ఓటీటీ ఆహాలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాకు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాలో అకిల్ కు జోడీగా పూజా హెగ్ఢె న‌టించింది. ఈ చిత్రాన్ని బ‌న్నీవాసు, అల్లు అర‌వింద్, వాసువ‌ర్మ సంయుక్తంగా నిర్మించారు.

More Related Stories