English   

రాఖీ బాయ్‌ని లైన్ లో పెడుతున్న పూరీ

Puri Jagannadh
2021-05-21 11:42:32

కేజీఎఫ్ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిన క‌న్న‌డ హీరో యశ్. ఈ సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ కావ‌డంతో య‌శ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఈ హీరో కేజీఎఫ్ 2 తో రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా య‌శ్ తో పూరీజ‌గ‌న్నాత్ ఓ పొలిటికల్ థ్రిల్ల‌ర్ ను తెర‌కెక్కించబోతున్నార‌ట‌. ఇప్ప‌టికే పూరీ య‌శ్ క‌థ‌ను వినిపించ‌గా రాఖీబాయ్ గ్రీన్ సిగ్న‌లో ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు కూడా టాక్. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా పూరీజ‌గ‌న్నాత్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నారు. రామ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం మంచివిజ‌యం సాధించింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత పూరీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది. అయితే ప్ర‌స్తుతం కరానా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా ప‌డింది. 

More Related Stories