English   

ఇది బాల‌య్య అంటే..క‌రోనా బాధితుల కోసం ఏం చేశారో తెలుసా

Balakrishna
2021-05-21 12:07:18

న‌ట‌సింహం నందమూరి బాల‌క్రిష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూ మ‌రోవైపు ఎమ్మెల్యేగా ప్ర‌జాసేవ చేస్తున్నారు. హిందూ పురం నియోజ‌వ‌ర్గం ఎమ్మెల్యేగా కొన‌సాగ‌తున్న బాల‌క్రిష్ణ ఇటీవ‌ల రూ.20 ల‌క్ష‌ల‌తో క‌రోనా బాధితుల‌కు మందులు స‌ర‌ఫ‌రా చేశారు. ఇక తాజాగా మ‌రోసారి గొప్ప‌మ‌న‌సు చాటుకున్నారు. హిందూపురంలోని త‌న గెస్ట్ హౌస్ ను బాల‌క్రిష్ణ కోవిడ్ బాధితుల కోసం ఇచ్చేశారు. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌న‌తో ఆస్ప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌ని ప‌రిస్థితి ఏర్పడింది. దాంతో ఎంతో మంది హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అలాంటి వారికోసం బాల‌య్య త‌న గెస్ట్ హౌస్ ను అరేంజ్ చేశారు. దాంతో బాల‌య్య అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. 

త‌మ హీరో చేసిన గొప్ప‌ప‌నికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండ‌గా బాల‌క్రిష్ణ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం అఖండ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాల‌య్య‌కు జోడీగా సినిమాలో ప్ర‌గ్యా జైశ్వాల్ న‌టిస్తోంది. అంతే కాకుండా సినిమాలో పూర్ణ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంది. మ‌రోవైపు హీరో శ్రీకాంత్ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టుగా కూడా స‌మాచారం. ఇక బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సింహా లెజెండ్ చిత్రాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. దాంతో అఖండ సినిమాపై కూడా ఎన్నో అంచనాలున్నాయి. 

More Related Stories