English   

ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు రంగంలోకి సుకుమార్

Sukumar
2021-05-21 13:54:12

క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లొనూ ఆక్సీజ‌న్ కొర‌త ఏర్ప‌డింది. అయితే ఈ కొర‌త‌ను తీర్చేందుకు సెల‌బ్రెటీలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్టటికే సోనూ సూద్ దేశంలో నాలుగు ఆక్జీజ‌న్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు స‌మ‌యానికి ఆక్సీజ‌న్ అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి మ‌రోవారంలో ఆక్సీజ‌న్ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. 

కాగా తాజాగా క్రేజీ డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఆక్సీజ‌న్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చారు. సుకుమార్ త‌న స్నేహితుడు అన్యం రాంబాబుతో క‌లిసి ఈ ఆక్సీజ‌న్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు తూర్పుగోదావ‌రి జిల్లా అధికారుల‌తో క‌లిసి సుకుమార్ బుధ‌వారం చ‌ర్చించారు. అనుమ‌త‌లు వ‌చ్చిన వెంట‌నే ప్లాంట్ ప‌నులు ప్రారంభిస్తామ‌ని సుకుమార్ చెబుతున్నారు. 

అంతే కాకుండా సుకుమార్ ఇప్ప‌టికే ఆజాద్ ఫౌండేష‌న్  కు రూ.7ల‌క్ష‌ల విలువ చేసే ఆక్సీజ‌న్ సిలిండ‌ర్ ల‌ను పంపిణీ చేశారు. అంతే కాకుండా గ‌త లాక్ డౌన్ స‌మ‌యంలోనూ సుకుమార్ క‌రోనా క్రైసెస్ కింద ప్ర‌భుత్వానికి రూ.10 ల‌క్ష‌లు అంద‌జేసారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే సుకుమార్ ప్ర‌స్తుతం పుష్ఫ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం క‌రోనా విజృంభ‌న‌తో ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.

More Related Stories