English   

ఆ బాలీవుడ్ భామ‌ను వ‌ద‌ల‌నంటున్న చ‌ర‌ణ్

Alia Bhatt
2021-05-21 17:18:21

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్రస్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చ‌ర‌ణ్ కు జోడీగా అలియాభ‌ట్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అలియాభ‌ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గానే చ‌ర‌ణ్ త‌రువాత సినిమాకు కూడా అలియాభ‌ట్ ను హీరోయిన్ గా అనుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా పై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ కూడా వ‌చ్చేసింది. పొలిటిక‌ల్ డ్రామాగా పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించ‌బోతున్నారు. అయితే తాజా ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ ప్ర‌కారం ఈ సినిమాలో రామ్ చ‌రణ్ కు జోడీగా అలియా భ‌ట్ న‌టించ‌బోతుంద‌ట‌. బాలీవుడ్ లో అలియాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేక‌ర్స్ అలియాభ‌ట్ ను హీరోయిన్ తీసుకోవాలనుకుంటున్నార‌ట‌. త్వర‌లోనే అలియాతో సినిమా గురించి మేక‌ర్స్ చ‌ర్చించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇక అలియా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే బ్యాక్ టూ బ్యాక్ చ‌రణ్ అలియా జోడీని తెర‌పై చూడొచ్చు. 

More Related Stories