English   

నఖిలీ ప్రొఫైల్ ద్వారా వేధింపులు...కొరియోగ్రాఫర్ అరెస్ట్

Choreographer arrested
2021-05-22 12:36:04

మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా ఎక్కడో ఓ చోట మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురవుతున్న సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేధికగా ఆకతాయిలు వేధింపులకు గురిచేస్తున్నారు. ఇక తాజాగా హైదరాబాద్ లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.  హైదరాబాద్ లో అమ్మాయిని వేధిస్తున్న కొరియోగ్రాఫర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ప్రొఫైల్ క్రెయేట్ చేసి అమ్మాయి అసభ్య ఫోటోలు, వీడియోలు కొరియోగ్రాఫర్ పోస్ట్ చేస్తున్నాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కొరియోగ్రాఫర్ మని ప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 లో బాధితురాలు ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించగా అదే ఫిల్మ్ కు డైరెక్టర్ గా మనిప్రకాశ్ వ్యవహరించారు. కాగా షూటింగ్ సమయంలో అమ్మాయికి తెలికుండా మనిప్రకాశ్ కొన్ని అసభ్యకర సన్నివేశాలను షూట్ చేసాడు. అయితే ఈ మధ్య ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో కొరియోగ్రాఫర్ తో బాధితురాలు మాట్లాడటం మానేసింది. ఇక అమ్మాయి దూరం పెట్టడంతో  ఫేక్ అకౌంట్ క్రెయేట్ చేసి మని ప్రకాష్ ఫోటోలు, వీడియో లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు.

More Related Stories