English   

రాధే శ్యామ్ మేకర్స్ కు టీ సిరీస్ రిక్వెస్ట్

 T Series
2021-05-22 17:05:13

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మొదట షూటింగ్ స్టార్ట్ చేసిన సినిమా రాధే శ్యామ్. ఈ చిత్రాన్ని మొదలు పెట్టి మూడేళ్ళయింది. కాగా కరోనా లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కాగా హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డే ప్రభాస్ మధ్య ఒక సాంగ్ మిగిలిపోయింది. ఇటీవల ఆ సాంగ్ షూటింగ్ ను ప్రారంభించగా మళ్లీ కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఇదిలా ఉండగా ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ ను 120 కోట్లకు సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ మేకర్స్ కు ఓ రిక్వెస్ట్ చేసిందట. సినిమాలో ప్రభాస్ పూజ హెగ్డే తో మరో రొమాంటిక్ పాటను తెరకెక్కించాలని టీసిరీస్ కోరిందట. ఆ పాట ప్రమోషన్స్ కు భాగా ఉపయోగపడుతుందని టీ సిరీస్ భావిస్తోందట. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేస్తున్నట్టు గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ కరోనా తో విడుదల వాయిదా వేశారు. దాంతో పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే మరో డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

More Related Stories