English   

ఆసి అన్న‌కు నో చెప్పిన బేబ‌మ్మ‌

Krithi Shetty
2021-05-24 12:12:16

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన బ్యూటీ కృతి శెట్టి. మొద‌టి సినిమాతోనే కృతి శెట్టి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సినిమా విజయంతో కృతికి ఆఫ‌ర్లు వ‌రుస క‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నా ఈ భామ మ‌రిన్ని ఆఫ‌ర్లు వ‌స్తున్నా తొంద‌ర ప‌డకుండా ఆచితూచి అడుగులు వేస్తుంది. అంతే కాకుండా ప‌లువురు హీరోల‌ను నేరుగు రిజెక్ట్ చేస్తుంది. ఇక తాజాగా ఉప్పెన సినిమాలో హీరోగా న‌టించిన వైష్ణ‌వ్ తేజ్ అన్న సాయిధ‌రమ్ తేజ్ కు సైతం కృతి నో చెప్పిన‌ట్టు తెలుస్తుంది. 

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఎస్డీటీ 15 పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు బీవీఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా సుకుమార్ కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ ప్లేను అందిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు కార్తీక్ వ‌ర్మ ఈ చిత్నాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టించడానికి కృతి శెట్టిని సంప్ర‌దించార‌ట‌. కానీ కృతి మాత్రం ఈ సినిమాను సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తుంది. సినిమా క‌థ బాగున్న‌ప్ప‌టికీ గ‌బ‌గ‌బా సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కృతి నిశ్చ‌యించుకుంద‌ట‌. దాంతో మేక‌ర్స్ మ‌రో హీరోయిన్ ను వెతికే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇక ప్ర‌స్తుతం కృతి శెట్టి నాని హీరోగా న‌టిస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోంది. అంతే కాకుండా సుధీర్ బాబు స‌ర‌స‌న కూడా ఓ సినిమాలో న‌టిస్తోంది. 

More Related Stories