English   

టాలీవుడ్ నిర్మాతలకు ఫేవరెట్ గా మారిన సోనూసూద్

sonu sood
2021-05-24 13:01:33

నటుడు సోనూసూద్ ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి అలరించారు. అరుంధతి, జులాయి లాంటి సినిమాల్లో విలన్ గా నటించి భయపెట్టారు. అయితే విలన్ అంటే  ఎప్పటికైనా సినిమాలో హీరో చేతిలో తన్నులు తిని ఒడిపోవాల్సిందే. కానీ ఇప్పుడు సోనూ కు వచ్చిన రియల్ హీరో ఇమేజ్ కారణంగా ప్రేక్షకులు అతడిని హీరోగా చూడాలని కోరుకుంటున్నారు. దాంతో ప్రొడ్యూసర్ లు కూడా సోనూ సూద్ హీరోగా సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉన్నారు. 

ముఖ్యంగా టాలీవుడ్ ప్రొడ్యూసర్ లు సోనూసూద్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు హీరోగా నటించాలని సోనూకు సంప్రదించారట. మరోవైపు సోనూ కూడా విలన్ పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. కొత్త సినిమాలకు సైన్ చేసేందుకు సోనూ రెడీగా ఉన్నారట. ఇదిలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో సోనూ హీరోగా ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసినట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలుబడలేదు.

More Related Stories