English   

స్టార్ యాంకర్ ఎమోషనల్ పోస్ట్

Star anchor
2021-05-24 14:12:39

బుల్లితెర‌పై టీవీషోలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ప్ర‌దీప్ తాజాగాఎమోషనల్ అయ్యారు. ఇటీవ‌ల క‌రోనా కార‌ణంగా ప్ర‌దీప్ తండ్రి మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌దీప్ తండ్రిని గుర్తు తెచ్చుకుని ఓ ఎమోష‌నల్ పోస్ట్ పెట్టారు. ప్ర‌దీప్ త‌న పోస్ట్ లో నేను ఎన్ని త‌ప్పుడు  నిర్ణ‌యాలు తీసుకున్నా మీరు నావెంట ఉండి న‌డిపించారు. నేను కోల్పోయిన ఆత్మ‌విశ్వాసాన్ని నాలో నింపింది మీరే. అది ఎన్నో విష‌యాలు నేర్చుకునేందుకు నాకు స‌హాయ‌ప‌డింది. మీ ప్రేమ‌కంటే నాకు ఈ ప్రపంచంలో గొప్ప‌దేమీ లేదు. మీరు ఎప్పుడూ నాకు ప్ర‌త్యేక‌మే అంతే కాకుండా నా జీవితంలో ఎలాంటి ప‌రిస్థితులు వ‌చ్చినా నేను మిమ్మ‌ల్ని మ‌ర్చిపోలేను. నేను ఎప్పుడూ వినోదాన్ని పంచాల‌ని న‌వ్వుల‌ను పూయించాల‌ని మీరు కోరుకున్నారు. మీ కోరిక‌ను నేను నెర‌వేరుస్తూనే ఉంటాను. మ‌ళ్లీ మ‌నం క‌లుసుకునేంత‌వ‌ర‌కూ వినోదం పంచుతూనే ఉంటాను. నేను మిమ్మ‌ల్ని మిస్ అవుతున్నాను నాన్న అంటూ ప్ర‌దీప్ ఎమోష‌నల్ అయ్యారు. ఎప్పుడూ న‌వ్వించే ప్ర‌దీప్ ఎమెష‌న‌ల్ పోస్ట్ పెట్ట‌డంతో ఆయ‌న అభిమానులు కూడా బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌దీప్ ను ఓదారుస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌దీప్ ప్ర‌స్తుతం స‌రిగ‌మ‌ప లిటిల్ చాంప్స్, ఢీ, కొంచెం  ట‌చ్ లో ఉంటే చెప్తా టీవీ షోల‌కు వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

More Related Stories