English   

అకిరా, ఆద్య టాలీవుడ్ ఎంట్రీ పై స్పందించిన రేణూదేశాయ్

 Renu Desai
2021-05-24 16:42:58

ప్రస్తుతం రేణూదేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తో విడాకుల తరవాత పిల్లలను చూసుకుంటూ రేణూ సినిమాలపై దృష్టి పెట్టారు. కొన్ని టీవీషోలతో పాటు ఆమె ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం కూడా చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూ లో అఖీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారు అని ప్రశ్నించగా....ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేనని...ప్రస్తుతానికి కరోనా పరిస్థితుల గురించి మాట్లాడుకుందామని అన్నారు.  కరోనా కారణంగా ఆద్య ,అకిరా ఇంట్లోనే ఉంటున్నారని...నెల రోజుల నుండి భయట అడుగుపెట్టలేదని అన్నారు. 

మిగతా పిల్లల్లాగే వాళ్ళు కూడా ఫ్రస్టేట్ అవుతున్నారని చెప్పారు. ఇక కరోనా బాధితులకు రేణూ దేశాయ్ చేస్తున్న సహకారం గురించి ప్రశ్నించగా....14 రోజులుగా సోషల్ మీడియా లో ఎన్నో రిక్వెస్ట్ లు వస్తున్నాయని చెప్పారు. బెడ్స్, ఆక్సిజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్ ల కోసం చాలా రిక్వెస్ట్ లు వచ్చాయని దాదాపు అన్ని మెసేజ్ లకు తాను స్పందించి షేర్ చేశానని అన్నారు. కేవలం తాను సింగిల్ గా ఈ పని చేయలేదని..తన టీమ్ కృషి ఎంతో ఉందని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఈ పని పట్ల గర్వంగా ఫీల్ అవ్వడం లేదని..కొంతమంది తన వల్ల కొలుకున్నారన్న సంతృప్తి చాలని అన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని..ముఖ్యంగా ధైర్యంగా ఉండాలని ఎవరూ డిప్రెషన్ లోకి వెళ్ళొద్దని అన్నారు. తాను కూడా ఈ కరోనా టైమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లానని ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని రేణూ వెల్లడించారు.

More Related Stories