English   

యూకేలో మహేష్ త్రివిక్రమ్ మూవీ షూట్ 

 Mahesh Trivikram
2021-05-25 09:40:10

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత మహేష్ ఏ సినిమా చేయనున్నారు అనే విషయంపై క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మరోసారి మహేష్ దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయనున్నారు. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మూడో సినిమా అనగానే ఇండస్ట్రీలో అపుడే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 

ఈ సినిమా చిత్రీకరణను విదేశాల్లో జరపాలని ప్లాన్‌ చేస్తోందట చిత్రబృందం. కథ రీత్యా హీరో క్యారెక్టర్‌కు ఫారిన్‌ టచ్‌ ఉంటుందని సమాచారం. ఇందుకోసం యూకేలో కీలక షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట త్రివిక్రమ్‌. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముందు ఫారిన్‌ షెడ్యూల్‌కు సంబంధించిన చిత్రీకరణను మొదలు పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే క హీరోయిన్‌గా నటిస్తుందని టాక్ రాగా.. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్. దీనిపై అధికారిక సమచారం విడుదల కావాలసివుంది. హారిక, హాసిని క్రియేసన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది.

More Related Stories