English   

తెలంగాణ కుర్రాడిగా నాని

 Nani
2021-05-25 13:10:19

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాని హీరోగా టక్ జగదీశ్ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సింది కానీ కోవిడ్ కారణంగా విడుదలను వాయిదా వేసుకున్నారు. మరోవైపు నాని ప్రస్తుతం అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల శ్యామ్ సింగరాయ్ కోసం ఓ భారీ సెట్ ను హైదరాబాద్ లో వేశారు. అయితే లాక్ డౌన్ పడటం తో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఇటీవల కురిసిన వర్షాలకు సెట్ డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కోటి రూపాయలకు పైగా లాస్ వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా నాని ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాను ఎస్ఎల్వీసీ బ్యానర్ పై నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్నారట. లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.

More Related Stories