English   

మా పేరెంట్స్ విడిపోవడమే నాకు హ్యాపీ..శ్రుతిహాసన్

Shruti Haasan
2021-05-25 17:46:32

క్రాక్ బ్యూటీ శృతిహాసన్.. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ క నటిగా ఎన్నో టాలెంట్స్ తనలో ఉన్నట్టు శృతి నిరూపించుకుంది. అయితే కెరీర్ లో మాత్రం హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. మొదట్లో శృతి హాసన్ ను ఐరన్ లెగ్ అంటూ పిలిచేవారు. కానీ గబ్బర్ సింగ్ సినిమాతో ఐరన్ లెగ్ కాదని గోల్డెన్ లెగ్ అని నిరూపించుకుంది బోల్డ్ బ్యూటీ. ఆ తరవాత వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరిపోయింది. 

ఇక ప్రస్తుతం తెలుగు, హిందీ,తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా వుంది. ఇక ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడే శృతి తాజా తన తల్లి దండ్రులు సారిక, కమల్ హాసన్ విడిపోవడంపై స్పందించింది. "వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. నా చిన్న వయసులోనే వాళ్ళు విడిపోయారు. వాళ్ళు కలిసి ఉన్నప్పటి కంటే విడిపోయాకే ఆనందంగా ఉన్నారు. ఇష్టం లేకపోయినా ఏవో కారణాలు చెప్పి కలిసి ఉండటం కరెక్ట్ కాదు. కాబట్టి వారు విడిపోవడమే నాకు హ్యాపీగా అనిపించింది. వాళ్ళు విడిపోవడం చాలా ఈజీగా జరిగిపోయింది." అంటూ శృతి కామెంట్స్ చేసింది. ఇక శృతి ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు సినిమా వాళ్ళకి పెళ్లిళ్లు అన్నా విడాకులు అన్నా చాలా చిన్న విషయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More Related Stories