English   

మెగాస్టార్ సినిమాలో అలా నటించబోతున్న అనుష్క

chiranjeevi
2021-05-26 10:17:25

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరవాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో ఆచార్య సినిమా షూటింగ్ జరుగుతోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా మరో రెండు రీమేక్ సినిమాలు కూడా ఆచార్య సినిమా పూర్తవగానే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. వాటిలో ఒకటి వేదళం రీమేక్ కాగా మరో సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ రీమేక్. ఈ సినిమాకు మొహాన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించేందుకు పలువురు హీరోయిన్ ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ పేరు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ స్వీటీ అనుష్క ఈ చిత్రంలో నటించబోతుందని ఇప్పటికే అనుష్కతో మేకర్స్ సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.

More Related Stories