English   

మరోసారి జోడీ కట్టబోతున్న ఇస్మార్ట్ కాంబో

Nidhi Agarwal
2021-05-26 10:23:38

అక్కినేని హీరోలు అఖిల్, నాగ చైతన్య ల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నిధి అగర్వాల్. అయితే నిధికి గుర్తింపు వచ్చింది మాత్రం రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే. ఈ సినిమాలో నిధి అందాలకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారింది. తెలుగులోనే కాకుండా ప్రస్తుతం ఇతర భాషల్లోనూ ఇస్మార్ట్ బ్యూటీకి ఫుల్ గా ఆఫర్లు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు జోడీగా హరిహరవీర మల్లు సినిమాలో నటిస్తోంది. అయితే ఈ భామకు మరో సారి రామ్ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టు సమాచారం. రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగు స్వామి ఓ సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కోసం నిధిని సంప్రదించారట. కథ నచ్చడంతో ఇస్మార్ట్ బ్యూటీ కు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలుగు తమిళ భాషల్లో నటించేందుకు కూడా నిధి అగర్వాల్ నే ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

More Related Stories