English   

నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ గుండెపోటుతో మృతి

 Annamreddy Krishna kumar
2021-05-26 10:46:09

టాలీవుడ్ ప్రొడ్యూసర్ అన్నంరెడ్డి కృష్ణకుమార్‌ కన్నుమూశారు. విశాఖలో ఉంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కన్నుమూశారు.  ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన ప్రాణాలను కోల్పోయినట్లు తెలుస్తోంది. సాయిపల్లవి, ఫహాద్‌ ఫాజిల్‌ జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత కృష్ణకుమార్‌ మృతిచెందడంతో చిత్రబృందమే కాకుండా మొత్తం టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.

More Related Stories