English   

ఎన్టీఆర్ షో ఆగిపోయినట్టేనా

Jr NTR
2021-05-26 14:13:33

బిగ్ బాస్ రియాలిటీ షోలో హోస్ట్ గా వచ్చి అదరగొట్టిన ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో ప్రోమోను కూడా విడుదల చేసారు. ప్రోమోలో ఎన్టీఆర్ తన స్టైల్ లో ఆకట్టుకున్నారు. అంతే కాకుండా మార్చ్ లో ఈ షోను ఘనంగా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆడిషన్స్ చేసి...షోను ప్రారంభించడం అంత సులభం కాదు. ఆడిషన్స్ కు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ షోలోనూ ఎక్కువ మంది పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో షో క్యాన్సిల్ అయ్యిందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. 

అంతే కాకుండా ఎన్టీఆర్ కూడా కరోనా నుండి ఇప్పుడే కోలుకున్నారు. కాబట్టి ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తరవారత తిరిగి ఆగస్ట్ లో ఈషో ప్రారంభం కాబోతున్నట్టు కూడా టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా మీలో ఎవరు కోటీశ్వరుడు షో గతంలో మాటీవీ లో ప్రసారం కాగా చిరంజీవి, నాగార్జున హోస్ట్ లుగా వ్యవహరించారు. ఆ తరవాత షోను ఆపేశారు. ఇప్పుడు మళ్లీ జెమినిలో అదే షోను ప్రారంభిస్తున్నారు. ఎన్టీఆర్ ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
 

More Related Stories