English   

వరుణ్ తేజ్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్

 Varun Tej
2021-05-26 17:26:04

మెగా హీరో వరుణ్ తేజ్ మొదటిసారిగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఘని. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. దాంతో జిమ్ తో తెగ కష్టపడుతున్నాడు వరుణ్ తేజ్. కరోనా లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయినా వరుణ్ కు మాత్రం ఫిట్నెస్ తిప్పలు తప్పడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా కోసం బాడీ పెంచి ఇప్పుడు వర్కౌట్ లు మానేస్తే మళ్లీ మొదటి నుండి వర్కౌట్స్ చేయాల్సి వస్తుంది. దాంతో షూటింగ్ లేకున్నా కష్టపడుతూనే ఉన్నాడు మెగా హీరో. ఇక ఈ సినిమాలో సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర లాంటి నటులు భాగం అవ్వడంతో సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. 

ఇక తాజాగా మరిన్ని అంచనాలు పెంచే ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో స్టేజ్ పై ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉండబోతుందట. అయితే ఈ సన్నివేశం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను మేకర్స్ రంగంలోకి దించుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నేడు స్పష్టం చేసింది. హాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు పని చేసిన లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రిమ్ బర్ లు ఘని కోసం పని చేస్తున్నట్టు తెలిపింది. గతంలో వీరు బాలీవుడ్ సినిమాల సుల్తాన్ కు కూడా పనిచేసారు. అంతే కాకుండా బాహుబలి సినిమాకు సైతం వీరు పని చేసారు.
 

More Related Stories