English   

ఫోన్ నంబర్ కోరిన నెటిజన్..దిమ్మ తిరిగే రిప్లై 

 Sreemukhi
2021-05-27 08:48:40

సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న బుల్లితెర భామల్లో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. శ్రీముఖి ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్ లు, టిక్ టాక్ వీడియోలతో కుర్రాళ్ళు మతి పోగొడుతుంది. ఇటీవల గోవా వెళ్లిన శ్రీముఖి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా హాట్ షో చేసింది. ఇక అందాల విందు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ అభిమానులతోనూ శ్రీముఖి ముచ్చటిస్తుంది. 

ఈ నేపథ్యంలోనే ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ అంటూ ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అయితే ఓ అభిమాని ఏకంగా శ్రీముఖి నంబర్ కావాలంటూ కోరాడు. "అక్కా ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ బ్యాన్ అవుతాయంటున్నారు. నంబర్ ఇస్తే ఎస్ఎమ్ఎస్ చేస్తా" అంటూ నంబర్ అడిగాడు. దానికి శ్రీముఖి ఒక్కడు సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం చెప్పే ఫోన్ నంబర్ 9848032919 వీడియోను పోస్ట్ చేసింది. దాంతో యువకుడికి దిమ్మతిరిగినంత పనైంది. ఇక మరో నెటిజెన్ నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా...మన్మథుడు సినిమాలోని వద్దురా సోదరా అనే పాటతో రిప్లై ఇచ్చింది.

More Related Stories