English   

మహేష్ బాబు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

 Krishna birthday
2021-05-27 11:45:13

మహేష్ బాబు అభిమానులకు కరోనా బ్యాడ్ న్యూస్ ను తెచ్చిపెట్టింది. ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున కచ్చితంగా మహేష్ సినిమాపై అప్డేట్ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఏదో ఒక అప్డేట్ ఉంటుందని అభిమానులు గత కొద్దిరోజులుగా అనుకుంటున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం నుండి అప్డేట్ ఉంటుందని భావించారు. సినిమా నుండి ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దాంతో అప్డేట్ కోసం ఇంతకాలం వెయిట్ చేశారు. 

అయితే తీరా ఇప్పుడు చూస్తే వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. కృష్ణ పుట్టిన రోజున ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని సర్కారువారి పాట చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. సమాజంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్యా తమ తదుపరి సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని ప్రకటించారు. సినిమా గురించి ఎవరూ కూడా ఎలాంటి అవస్థవాలను సృష్టించవద్దని పేర్కొన్నారు. ఏదైనా అప్డేట్ ఉంటే అధికారిక ఖాతాలోనే పోస్ట్ చేస్తామని..అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

More Related Stories