English   

ఓటీటీలో టక్ జగదీశ్..

Tuck Jagadish
2021-05-27 19:37:23

నాచురల్ స్టార్ నాని టక్ జగదీశ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఇటీవలే పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. కాగా తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం దాని గురించి చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు హీరో నాని ఒప్పుకున్నారట. అంతే కాకుండా త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సినిమాలో నానీకి జోడీగా రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ హీరోయిన్ లుగా నటించారు. జగపతిబాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఒక వేళ ఓటీటీ డీల్ గనక కుదిరితే సెకండ్ వేవ్ లో టాలీవుడ్ నుండి విడుదలయ్యే మొదటి పెద్ద సినిమాగా టక్ జగదీశ్ నిలవబోతుంది.

More Related Stories