English   

మా గుండెలను మరొక్కసారి తాకి పోండి  తాతా..ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్

JR NTR
2021-05-28 11:32:55

దివంగత ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయనను తెలుగు ప్రజలు స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలు కూడా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాతను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. మా గుండెలను ఒక్కసారి తాకిపోండి తాత అంటూ పోస్ట్ పెట్టారు. "మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ దరిత్రిని.. ఈ గుండెను తాకిపోండి తాత..సదా మీ ప్రేమకు భానిస" అంటూ ఎమోషనల్ అయ్యారు. 

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ ట్విట్టర్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేసారు. "ప్రముఖ గాయకులు నవయుగ వైతాళికులు భూపెన్ పూజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు.తెలుగు తేజం నందమూరి తారకరామారావు గారికి భారత రత్న ఇస్తే అది తెలుగువారికి గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ కు ఈ గౌరవం దక్కితే తెలుగు వారందరికీ దక్కే గౌరవం" అంటూ మెగాస్టార్ ట్వీట్ లో పేర్కొన్నారు.

More Related Stories