English   

సిద్దిపేటలో రియల్ హీరో ఆక్సిజన్ ప్లాంట్

 Sonu Sood
2021-05-28 12:31:19

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో మొదలుపెట్టిన సహాయ కార్యక్రమాలను రియల్ హీరో సోనూ సూద్ కొనసాగిస్తున్నారు. సెకండ్ వేవ్ లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం తో ఆక్సిజన్ కొరత, మందుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో సోనూ తన టీమ్ తో కలిసి పనిచేసారు. ఎంతోమంది రెమిడెసివిర్ ఇంజెక్షన్స్ కావాలని....కోరిన వారికి వెంటనే అందించి ప్రాణాలను కాపాడారు. ఇక కరోనా థర్డ్ వేవ్ త్వరలో రాబోతుందని డాక్టర్ లు నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా థర్డ్ వేవ్ సమయంలో కేసుల సంఖ్య మరింత ఎక్కువ వ్యాపిస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం థర్డ్ వేవ్ కట్టడికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించలేదు కానీ సోనూ మాత్రం థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం నాలుగు ప్లాంట్ ల ఏర్పాటుకు ఇప్పటికే సోనూ సూద్ ఒప్పందం చేసుకున్నారు.  ఈ క్రమంలో తెలంగాణలోని సిద్దిపేట లోనూ ఓ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ సోనూసూద్ టీమ్ మంత్రి హరీష్ రావు ను సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

More Related Stories