English   

బాహుబలి రేంజ్ లో కల్యాణ్ రామ్ బింబిసార లుక్

Bimbisara
2021-05-28 13:11:37

యంగ్ హీరో నందమూరి కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ సినిమాల్లో నటించి ఆకట్టుకోగా ఇప్పుడు ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ "బింబిసార" అనే చిత్రంలో నటించబోతున్నాడు. గొప్పరాజు ,బుద్ధుడి స్నేహితుడైన బింబిసారుడి కథతో తెరకెక్కుతున్న "బింబిసార" అనే సినిమాతో వస్తున్నారు. 

తాజాగా ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు లుక్ ను రివీల్ చేశారు. కాగా కళ్యాణ్ రామ్ లుక్ వీడియోలో బాహుబలి సినిమా రేంజ్ లో కనిపిస్తుంది. ఈ టైటిల్ లుక్  కళ్యాణ్ రామ్ అభిమానుల్లో ఎన్నో అంచనాలు పెంచాయి. అద్భుతంగా ఉందని సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు వశిస్ట్ అనే దర్శకుడు డైరెక్షన్ చేస్తున్నారు. హరికృష్ణ కె ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాకుండా కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే హీరోయిన్ మిగతా నటీనటుల వివరాలను ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలోనే దానిపై కూడా అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

More Related Stories