English   

ఆగిపోయిన లూసిఫర్ రీమేక్...డైరెక్టర్ క్లారిటీ

lucifer remake
2021-05-28 13:42:39

మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ రీమేక్ ను మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి మోహన్ రాజా ఇచ్చిన స్క్రిప్ట్ నచ్చలేదని అందువల్లే సినిమాను నిలిపివేశరని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలపై మోహన్ రాజా క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మోహన్ రాజా...సినిమా నిలిచిపోలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు వెల్లడించారు. అంతే కాకుండా ఇప్పటికే సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రెండు పాటలను కూడా సిద్ధం చేసారని చెప్పారు. అంతే కాకుండా సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇదిలా ఉండగా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు. ఇక మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తవగానే ఫోకస్ మొత్తం లూసిఫర్ రీమేక్ పై పెట్టనున్నారు. ఈ సినిమా తో పాటు సీజరు వేదళం రీమేక్ కూడా చేయబోతున్నారు.

More Related Stories