English   

స్వచ్చంధ సంస్థను ప్రారంభిస్తున్న రేణూ దేశాయ్...ముఖ్యంగా వారికోసమే

renu desai
2021-05-28 16:58:47

టాలీవుడ్ నటి రేణూదేశాయ్ ప్రస్తుతం టీవీ షోలతో అలరిస్తున్నారు. అంతే కాకుండా రేణూ దేశాయ్ ప్రస్తుతం ఒక సినిమాకు కూడా దర్శత్వం వహిస్తున్నారు. కాగా కరోనా విజృంభన నేపథ్యంలో రేణూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సాయం చేస్తున్నారు. కరోనా ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్ లు ఇతర అవసరాల కోసం తనకి ఎవరు మెసేజ్ చేసినా ఆమె వెంటనే రెస్పాన్డ్ అవుతున్నారు. తన టీమ్ తో కలిసి బాధితుల అవసరాలను షేర్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. అయితే గత రెండు రోజులుగా ఆక్సిజన్ మరియు బెడ్స్ కోసం మేసేజ్ లు రావడం తగ్గిందని పరిస్థితులు కొద్దిగా సాధారణ స్థితికి వచ్చాయని తాను ఇక ఇన్బాక్స్ ను క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

అంతే కాకుండా తాను గడిచిన రోజుల్లో ఒక విషయాన్ని గ్రహించానని రేణూ దేశాయ్ చెప్పారు. ఎవరూ ఆకలితో పడుకోకూడదని ఆమె అన్నారు. ప్రపంచంలో కావాల్సినంత ఆహారం ఉందని కానీ అది ఆకలితో ఉన్నవాళ్లకు చేరడం లేదని అన్నారు. దీనిపైనే తను ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆకలి తో ఉన్నవారి కడుపు నింపేందుకు తాను ఓ స్వచ్చంధ సంస్థను ప్రారంభిస్తున్నట్టు రేణూదేశాయ్ వెల్లడించారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామని అన్నారు. రిజిస్ట్రేషన్ మరియు ఇతర పనులు త్వరగా జరగాలని  ఆమె కోరుకుంటున్నట్టు తెలిపారు.

More Related Stories