English   

పూరి పై విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Vijayendra Prasad
2021-05-28 17:08:55

ప్రముఖ రచయిత, దర్శకధీరుడు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆలీతో టీవీ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి తరవాత మీకు నచ్చిన దర్శకుడు ఎవరంటూ ప్రశ్నించగా ఒక్క నిమిషం ఆలోచించకుండా పూరిజగన్నాథ్ అని చెప్పారు. పూరి జగన్నాథ్ నా శత్రువు..ఆయన అంటే నాకు కుళ్లు..అందుకే ఆయన ఫోటోను స్క్రీన్ వాల్ పేపర్ గా పెట్టుకోవడాన్ని చూపించారు. అంతే కాకుండా మీరు దర్శకుడిగా సక్సెస్ అవ్వలేదని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించగా ఓ డైరెక్టర్ అలా చెప్పారని అన్నాడు. 

తాను చేసిన రాజన్న సినిమా చూసిన దర్శకుడు భాగుందని మెచ్చుకున్నాడని.. అదే డైరెక్టర్ తన తరవాత సినిమా చూసి మీకు దర్శకత్వం రాదని ముఖం పై చెప్పేసాడన్నారు. ఆ దర్శకుడు ఎవరో కాదని తన కొడుకు రాజమౌళి నే అన్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా చూసారా అని ప్రశ్నించగా చూశానని అన్నారు. అంతే కాకుండా సినిమాలో అలియా భట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ ఉండబోతుందని అన్నారు. అలియా సినిమాలో అందరినీ డామినేట్ చేసిందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా కథను విజయేంద్రప్రసాద్ అందించారు. అంతే కాకుండా మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు కూడా ఆయనే కథను అందిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

More Related Stories