English   

బాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో

Satya Dev
2021-05-29 12:00:16

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టి హీరో స్థాయికి వచ్చిన నటుడు సత్యదేవ్. టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా సత్యదేవ్ హీరో రేంజ్ కి ఎదిగారు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ జ్యోతి లక్ష్మి సినిమాతో సత్యేదేవ్ కు గుర్తింపు వచ్చింది. ఆ తరవాత పలు సినిమాలతో బిజీగా మారాడు. అంతే కాకుండా గత లాక్ డౌన్ సమయంలో వరుసగా ఓటీటీలో సినిమాలు విడుదల చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా సత్యదేవ్ హీరోగా నటించిన మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇదిలా ఉండగానే సత్యేదేవ్ మరో బంపరాఫర్ అందుకున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారీ బడ్జెట్ సినిమా రామ్ సేతులో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు మేకర్స్ సత్యదేవ్ ను సంప్రదించారట. దాంతో సత్యదేవ్ కూడా ఈ భారీ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రామ్ సేతు చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుండి సినిమాలో భాగం చేస్తే ఇక్కడ కూడా సినిమాపై క్రేజ్ పెంచవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సత్యదేవ్ కు ఆఫర్ ఇస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నుశ్రత్ భరుచ, జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

More Related Stories