English   

హను మ్యాన్ సినిమాకు పరిశీలనలో ఆ ఇద్దరు హీరోలు

Prashanth Varma
2021-05-29 12:59:35

ఒకప్పుడు తెలుగులో రోటీన్ మాస్ ప్రేమకథ సినిమాలు రాగా ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు వస్తున్నాయి. అంతే కాకుండా కొత్త దర్శకులు సరికొత్త ఐడియాలతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.  అలా సరికొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ కూడా ఒకరు. ప్రశాంత్ వర్మ అ.. , కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో ఇటీవల విడుదలైన జాంబిరెడ్డి సినిమా మంచి విజయం సాధించింది. జాంబీస్ అనే కొత్త జోనర్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. 

ఇప్పుడు తాజాగా ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు. తెలుగులో ఇప్పటివరకు ఒరిజినల్ సూపర్ మ్యాన్ సినిమాలు విడుదల కాలేదు. కాగా ఇప్పుడు "హను-మ్యాన్" అనే ఒరిజినల్ సూపర్ మ్యాన్ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈరోజే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. కానీ ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ చిత్రంలో హీరోగా నటించేదుకు మేకర్స్ తేజ సజ్జ, సుధీర్ బాబు పేర్లను పరిశీలిస్తున్నారు. తేజ సజ్జ ను జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయం చేసింది కూడా ప్రశాంత్ వర్మనే అయితే ఈ సినిమాకు కూడా ఆయన్నే తీసుకుంటారా లేదంటే సుధీర్ బాబుతో తెరకెక్కిస్తారా అన్నది చూడాలి.

More Related Stories