English   

తగ్గేదే లే అంటున్న అల్లు శిరీష్..బెడ్ పై అనూతో అలా

Allu Sirish
2021-05-29 19:43:16

కొద్ది రోజులుగా  అల్లువారి చిన్నోడు శిరీష్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయారు. అనూ ఇమాన్యుయేల్ తో కాఫీ షాప్ ల‌కు వెల్ల‌డం...ఇద్ద‌రూ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌చేయ‌డం చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే అవ‌న్నీ సినిమా ప్ర‌మోష‌న్ కోసమేన‌ని అర్థ‌మైపోయింది. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ను ఖ‌రారు చేయ‌లేదు గానీ సినిమాను అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ పోస్టర్ ను విడుద‌ల చేసారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా నుండి ప్రీలుక్ పోస్టర్ ను కూడా విడుద‌ల చేశారు. 

కాగా ఈ పోస్ట‌ర్ లో అల్లు వారబ్బాయి రెచ్చిపోయాడు. బెడ్ పై అనూ ను వాటేసుకుని క‌నిపిస్తున్నారు. ఈ రొమాంటిక్ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇక అల్లు శిరీష్ ఇదివ‌ర‌కు ప్రేమక‌థా చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ ఈ రేంజ్ ఏ సినిమాలోనూ రొమాన్స్ చేయ‌లేదు. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే శిరిష్ డిసైడ్ అయ్యిన‌ట్టు ఈ పోస్ట‌ర్ చూస్తే తెలిసిపోతుంది. అల్లు అర్జున్ రెండేళ్ల క్రితం ఏబీసీడీ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా అనుకున్న మేర విజ‌యం సాధించ‌లేక పోయింది. మ‌రోవైపు అనూ ఇమాన్యుయేల్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించినా ప్ర‌స్తుతం పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. దాంతో తన‌కు కూడా ఈ సినిమా విజ‌యం ఎంతో అవ‌స‌రం. మ‌రి ఈ చిత్రంతో ఇద్ద‌రూ హిట్ కొడ‌తారా లేదా చూడాలి.

More Related Stories