English   

ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ టైటిల్ విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న ఆహా టీమ్‌

In the Name of God
2021-05-30 19:19:35

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌’. ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న‌ వెస్ సిరీస్ టైటిల్ లోగో, లుక్‌ను రీసెంట్‌గానే రిలీజ్ చేశారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సురేశ్ కృష్ణ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. విద్యా సాగ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ వెబ్ సిరీస్ విష‌యంలో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ వెబ్ సిరీస్ టైటిల్ విష‌యంలో ఆహా ఫౌండ‌ర్‌, నిర్మాత అల్లు అర‌వింద్‌కు, సురేశ్ కృష్ణ‌కు మ‌ధ్య బేదాభిప్రాయాలు నెల‌కొన్నాయ‌ట‌. 

స‌మాచారం మేర‌కు అల్లు అర‌వింద్ టైటిల్ విష‌యంలో రిస్క్ తీసుకోవాల‌ని అనుకోవ‌డం లేద‌ట‌. అలా తీసుకుంటే అన‌వ‌స‌ర‌మైన కాంట్ర‌వ‌ర్సీ వస్తుందేమోన‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. అలాగే తెలుగు మాధ్య‌మం రూపొందిస్తున్న  ఈ సిరీస్‌కు ప‌క్కా ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఎలా అని కూడా ఆయ‌న ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం. అయితే వెబ్ సిరీస్ నిర్మాత సురేష్ కృష్ణ మాత్రం స‌బ్జెక్ట్‌కు యాప్ట్ అయ్యే టైటిల్ ఇదేన‌ని భావిస్తున్నార‌ట‌. టైటిల్ గురించి ఎంటైర్ టీమ్ మ‌ల్ల‌గుల్లాలు ప‌డింది. చాలా డిస్క‌ష‌న్స్ న‌డిచాయి. ఎట్ట‌కేల‌కు ఈ వెబ్ సిరీస్‌కు ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే అనుకున్నార‌ట‌. మ‌రి అల్లు అర‌వింద్ భావిస్తున్న స‌మ‌స్య వ‌స్తుందా లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More Related Stories