English   

మహేష్ రాజమౌళి సినిమా... ఆఫ్రికన్ బ్యాక్ గ్రౌండ్ అంతా తూచ్

Mahesh Babu
2021-05-31 11:24:40

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న జక్కన్న ఈ సినిమా పూర్తవగనే మహేష్ బాబు సినిమా కోసం పని చేస్తారు. అయితే ఈ సినిమా పై రక రకాల వార్తలు కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తారని..ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేసారని వార్తలు వినిపించాయి. 

అయితే తాజాగా మహేష్ రాజమౌళి సినిమాను నిర్మించబోయే నిర్మాత కే ఎల్ నారాయణ ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. రాజమౌళి తో సినిమా చేసేందుకు మహేష్ బాబు ఎంతో ఆసక్తితో ఉన్నారని చెప్పాడు. రాజమౌళి ఎప్పుడంటే మహేష్ అపుడే సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని చెప్పారు.  జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో బిజీగా ఉన్నాడని అలాగే మహేష్ బాబు ఇమేజ్ కు సరిపోయేలా స్టోరీ లైన్ ను సెట్ చేస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుంది అన్న గాసిప్స్ పై కేఎల్ నారాయణ స్పందించారు. అసలు అందులో ఎలాంటి నిజం లేదని ఖండించారు. అంతే కాకుండా అసలు స్టోరీ లైన్ ఏంటో తనకు కూడా తెలియదని స్పష్టం చేశారు.

More Related Stories