English   

అఖీరాతో పవన్ ఫోటోలపై రేణూ దేశాయ్ అసంతృప్తి

Renu desai
2021-05-31 14:38:17

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుమారుడు అఖీరా నందన్ ఫోటోలు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ మ్యూజిక్ టీచర్ తన వద్ద పవన్, అఖీరా సంగీతం నేర్చుకోబుతున్నారని...వారి ఇంటివద్దే డెమో పూర్తయిందని సోషల్ మీడియాలో పేర్కొంది. అంతే కాకుండా తాను పవన్ అభిమాని అని పేర్కొంది. పవన్ కు సంగీతం పై ఎంతో అభిమానం ప్రేమ ఉన్నాయని పేర్కొంది. పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన డెమో తో సంతృప్తిగా ఉన్నారని..తనను మ్యూజిక్ టీచర్ గా ఎంచుకున్నందుకు చాలా హ్యాపీ అని పేర్కొంది. 

అయితే వీరి ఫోటోలు ఉదయం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫోటోలు చక్కర్లు కొట్టడంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య అఖీరా తల్లి రేణూ దేశాయ్ అసంతృప్తి గా ఉన్నారట. తన పర్మిషన్ లేకుండా ఎందుకు అఖీరా ఫోటోలను వాడుతున్నారని సీరియస్ అయ్యారట. అంతే కాకుండా అఖీరా ఎలాంటి సంగీతం నేర్చుకోవడం లేదని రేణూ దేశాయ్ చెబుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా రేణూదేశాయ్ పవన్ కల్యాణ్ 2012 లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లలతో కలిసి రేణూ పూణే లో ఉంటున్నారు. అంతే కాకుండా మళ్లీ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి బుల్లి తెరపై సందడి చేస్తున్నారు.

More Related Stories