English   

గ్రామాలకు డెడ్ బాడీ ఫ్రిజర్ బాక్సులను అందిస్తున్న సోనూసూద్

Sonu Sood
2021-05-31 15:38:50

సోనూసూద్ మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను సోను ఇస్తున్నారు. ఇందులో భాగంగా సంకిరెడ్డి పల్లి, ఆషాపూర్ బోంకూర్, ఓర్వకల్, మద్దికెర మరియు ఇతర గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో ఆ గ్రామ సర్పంచులు సహాయం కోసం సోనుసూద్ ను సంప్రదించారు. దీంతో సోనూసూద్ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

ఇన్నాళ్లు ఈ గ్రామాల వారు సమీప నగరం నుండి ఫ్రీజర్ బాక్స్ రావడానికి ఇబ్బందులు పడ్డారు. దీనివల్ల శవాలు కుళ్లిపోయి అయిన వారి చివరి చూపుకు దూరమయ్యేవారు. ఇది చాలా అసౌకర్యాలకు కారణమైంది. సహాయం కోసం సోను సూద్ ను సంప్రదించడంతో ఎంపిక చేసిన గ్రామాలకు వీలైనంత త్వరగా బాక్సులను అందుబాటులో ఉంచుతామని సర్పంచ్లకు సోను హామీ ఇచ్చారు.

More Related Stories