English   

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్

 Pranitha Subhash
2021-05-31 18:12:53

టాలీవుడ్ హీరోయిన్స్ లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే ముద్దుగుమ్మ ప్రణీత. బేసిక్ గా కన్నడ భామ అయినప్పటికీ ప్రణీత పక్కింటి అమ్మాయిలా కనిపించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. కేవలం ప్రణిత నటి గానే కాకుండా గొప్ప మనసున్న మనిషిగా కూడా పాపులర్ అయింది. లాక్ డౌన్ వేళ ఈ భామ దగ్గరుండి ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని సప్లై చేసింది. మరోవైపు రామ మందిర నిర్మాణానికి విరాళం అందించిన మొదటి హీరోయిన్ గా ప్రణిత నిలిచింది. దాంతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. 

ఇదిలా ఉండగా ప్రణీత గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళి చేసుకుని అందర్నీ షాక్ కు గురి చేసింది. బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణిత వివాహం చేసుకుంది. అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య ప్రణిత వివాహం జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సెలబ్రెటీలు అంతా కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య పెళ్లి చేసుకుంటున్న వాస్తవమే కానీ ప్రణిత పెళ్లి వార్త మాత్రం అసలు ఇప్పటివరకు భయటకు రాలేదు. ఇక ప్రస్తుతం పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తో ప్రాణితంపెళ్లి చేసుకున్న విషయం నెట్టింట హల్చల్ చేస్తోంది.

More Related Stories