English   

బాలయ్యకు నో చెప్పిన రకుల్.. కారణం ఇదే

Rakul Preet Singh
2021-06-01 08:57:32

ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడం తో "అఖండ" సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాతో ఖచ్చితంగా వీరి కాంబో హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. ఇక ఈ సినిమా తరవాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

అఖండ సినిమా తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నారట. దాంతో హీరోయిన్ గా నటించేందుకు రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించారట. కానీ రకుల్ ఈ సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఫుల్ బిజీగా ఉండటం తో రకుల్ నో చెప్పేసిందట. ఇక మరోవైపు గోపిచంద్ మలినేని శ్రుతిహాసన్ ను కూడా సంప్రదించారట. కానీ శృతి ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా చేసేందుకు నిరాకరించిందట. ఇక బాలయ్య కు జోడిగా ఏ హీరోయిన్ ఫిక్స్ అవుతుందో చూడాలి.

More Related Stories