English   

త్రిపాత్రాభినయం చేయనున్న పవన్ కళ్యాణ్

 Pawan kalyan
2021-06-01 11:07:05

పవన్ కళ్యాణ్ ఇటీవలే వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.  క‌రోనా రావ‌డంతో ఆయ‌న కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకొని కోలుకున్నారు. రెండు నెల‌ల పాటు ఆయ‌న‌కు పూర్తి విశ్రాంతి కావాల‌ని వైద్యులు చెప్ప‌డంతో ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పలు కథనాల ప్రకారం.. వీరమల్లు సినిమాలో పవన్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ ను డైరెక్టర్ క్రిష్ అద్భుతంగా డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ సినిమా పై అంచనాలు పెంచేసింది. 
 

More Related Stories