English   

పేదవారి కడుపునింపుతున్న షకీలా

 Shakeela
2021-06-01 18:06:06

బోల్డ్ పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి షకీలా. వందకు పైగా సినిమాల్లో నటించిన షకీలాకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు. దాంతో అడపా దడాపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాల విషయం పక్కన పెడితే ఏ ఇంటర్వ్యూ కు వచ్చినా షకీలా తన జీవితంలో ఎన్నో కష్టాలు పడినట్టు చెబుతుంది. తాను సినిమాల్లో నటించి భాగానే సంపాదించానని కానీ కుటుంబం అంతా కలిసి తనను మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఎన్నో కష్టాలు పడిన షకీలా కరోనా వేళ ఎవరూ ఆకలి తో ఉండకూడదని ఆకలి తీరుస్తోంది. లాక్ డౌన్ కారణంగా రోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపుతోంది. దానికి సంబంధించిన ఫోటోలను షకీలా సోషల్ మీడియాలో షేర్ చేయడం తో వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసిన షకీలా మనసు చాలా మంచిదని నెటిజెన్ లు కామెంట్స్ పెడుతున్నారు.

More Related Stories