English   

సోనూసూద్ పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

Tammareddy
2021-06-01 18:26:15

రీల్ విలన్ నుండి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్. కరోనా వేళ ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తూ సోనూ రియల్ హీరోగా పిలవబడుతున్నారు. గతేడాది లాక్ డౌన్ వేళ ప్రారంభించిన సహాయ కార్యక్రమాలను సోనూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. దాంతో ఎంతోమంది సోనూసూద్ పై ప్రశంసలు కురిపిస్తుంటే తాజాగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఐదేళ్ల క్రితం సోనూసూద్ తో తనకు చేదు అనుభవం ఎదురైందని సోనూసూద్ అన్నారు. 

వికలాంగులకు సంబంధించిన ఓ కార్యక్రమం కోసం సోనూ ని సంప్రదించగా కార్యక్రమానికి రావాలంటే డబ్బులు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. దాంతో సోనూ సూద్ చాలా కమర్షియల్ అనుకున్నా అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు మాత్రం సోనూసూద్ దానికి భిన్నంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసే సహాయ కార్యక్రమాలకు మెచ్చుకోవాల్సిందేనని చెప్పారు తన ఆస్తులను సైతం అమ్ముకుని సేవ చేయడం నిజంగా గ్రేట్ అని అన్నారు. ఆయన ప్రస్తుతం ఎంతోమందికి దేవుడిలా సాయం చేస్తున్నారని  చెప్పారు. అయితే సోనూ సూద్ ను పొగడచ్చు కానీ ఇత్రులపై బురద చల్లకూడదని చెప్పారు.

More Related Stories