English   

బాల‌య్య సినిమాలో అన‌సూయ నెవ్వ‌ర్ బిఫోర్ రోల్

Anchor Anasuya
2021-06-01 18:32:39

న‌ట‌సింహం నంద‌మూరి బాలక్రిష్ణ ప్ర‌స్తుతం అఖండ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో బాల‌య్య‌కు జోడీగా ప్ర‌గ్యా బైశ్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. మ‌రోవైపు హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో బాల‌య్య‌కు విల‌న్ గా న‌టించ‌బోతున్నాడంటూ ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాకుండా  ఈ సినిమాకు త‌మ‌న్ స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతోంది. ఈ చిత్రంలో జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ యాంక‌ర్ అన‌సూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నట్టు తెలుస్తుంది. 

అఖండ సినిమాలో ఓ ఆల‌య పూజారికి భార్య పాత్ర‌లో అనసూయ న‌టించ‌బోతుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా దాదాపు సినిమాలో అన‌సూయ పాత్ర 20 నిమిషాల పాటు ఉండ‌బోతుందంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఇందులో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే దీనిపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.  ఇదిలా ఉండ‌గా అన‌సూయ  ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు వ‌రుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. ఇప్ప‌టికే ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న ఖిలాడీ సినిమాలో ఓ పాత్ర‌లో న‌టించింది. అంతే కాకండా అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న పుష్ఫ సినిమాలోనూ అనసూయ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. 

More Related Stories