English   

కేటీఆర్ సోనూసూద్ ట్విట్ట‌ర్లో ముచ్చ‌ట్లు..నెట్టింట వైర‌ల్

 KTR
2021-06-01 18:40:39

రియ‌ల్ హీరో సోనూసూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ మ‌ధ్య తాజాగా ఆస‌క్తిక‌ర సంభాష‌ణ సాగింది. ఓ నెటిజ‌న్ ఆక్సీజ‌న్ కాన్సన్ట్రేట‌ర్ కోసం కేటీఆర్ కు ట్విట్ట‌ర్ లో అభ్య‌ర్థించ‌గా కేవ‌లం 10గంట‌ల్లో అత‌డికి కేటీఆర్ ఆయ‌న టీం స‌హ‌కారంతో ఆక్సీజ‌న్ కాన్స‌న్ట్రేట‌ర్ ను అంద‌జేశాడు. దాంతో అత‌డు కేటీఆర్ ను ప్ర‌శంసిస్తూ సూప‌ర్ హీరో అంటూ ప్ర‌శంసించారు. కాగా దానికి కేటీఆర్ రిప్లై ఇస్తూ ప్ర‌జ‌లు త‌న‌ను ఎన్నుకున్నందుకు చేస్తున్న చిన్న డ్యూటీ అని సోనూసూద్ నిజ‌మైన సూప‌ర్ హీరో అని కాబ‌ట్టి ఆయ‌న్ను క‌చ్చితంగా రియ‌ల్ హీరో అని పిల‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. అయితే కేటీఆర్ చేసిన ట్వీట్ పై సోనూసూద్ స్పందించారు. 

కేటీఆర్ కు కృతజ్ఞ‌త‌లు తెలుపుతూ...తెలంగాణ‌ను ఎంతో అభివృద్ధి చేసార‌ని. కేటీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిదని అన్నారు. తెలంగాణ త‌న‌కు రెండో ఇళ్ల‌ను సోనూసూద్ పేర్కొన్నారు. తెలంగాణ త‌న‌కు ప‌నిచేసుకునే ప్ర‌దేశం అని తెలిపారు. అంతే కాకుండా తాను కేటీఆర్ ను క‌ల‌వ‌డానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాన‌ని హైద‌రాబాద్ వ‌చ్చిన వెంట‌నే క‌లుస్తాన‌ని సోనూ సూద్ అన్నారు. మ‌రోవైపు కేటీఆర్ సోనూసూద్ బ్ర‌ద‌ర్ మీరు మీ కార్య‌క్ర‌మాల‌ను ఇలాగే కొన‌సాగించాల‌ని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేయ‌గా సోనూ సూద్ త‌ప్ప‌కుండా ఈ మిష‌న్ ను కొన‌సాగిస్తాన‌ని చెప్పారు. ఇక వీరిద్ద‌రి సంభాష‌ణ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

More Related Stories