English   

కన్నడ సినీ కార్మికులకు అండగా యష్ 

KGF 2
2021-06-02 11:43:44

సినీ ఇండస్ట్రీపై కోవిడ్ ఎఫెక్ట్ బాగా పడింది. ఎక్కడికక్కడ షూటింగ్స్, థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. దీంతో సినీ కార్మికులు అల్లాడిపోతున్నారు. అయితే అలాంటి వారిని ఆదుకునేందుకు కేజీఎఫ్ స్టార్ యష్ ముందుకొచ్చారు. కన్నడ సినీ పరిశ్రమలోని 21 డిపార్ట్‌మెంట్స్‌లో ఉన్న 3వేల మంది సభ్యులకు ఒక్కొక్కరికి 5000 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా యష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఇది ఒంటరిగా పోరాడే సమయం కాదు, కాబట్టి మా సినిమా కళాకారులు, సాంకేతిక నిపుణులు మరియు కార్మికులకు తన వంతు సాయంగా ఈ సొమ్ము అందించబోతున్నట్లు తెలిపారు. నేరుగా సినీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయ్యేలా ఆయన చర్యలు తీసుకోనున్నారు. ఈ చిన్న సాయం వారి కష్టాలనన్నింటినీ తీర్చలేదని తెలుసు కానీ ఎంతో కొంత ఊరటనిస్తుందని యష్ పేర్కొన్నారు.

More Related Stories