English   

రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేసిన సోనూసూద్

Sonu Sood
2021-06-02 14:57:32

టాలీవుడ్ బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించిన సోనూసూద్ కు సినిమాల కంటే ఆయ‌న చేస్తున్న సేవాకార్య‌క్ర‌మాల‌తోనే ఎక్క‌వ పాపులారిటీ వ‌చ్చింది. దాంతో సినిమాల్లో సోనూసూద్ ను విలన్ గా చూసేకంటే హీరోగా చూసేందుకు ప్రేక్ష‌కులు ఎంతగానో ఆస‌క్తి చూపుతున్నారు. దాంతో సోనూకు కూడా హీరోగా న‌టించేందుకు అవ‌కాలు వ‌స్తున్నాయి. ఇక ఆఫ‌ర్లు వ‌రుస క‌డుతుండ‌టంతో సోనూసూద్ త‌న రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేశార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. 

సోనూసూద్ చివ‌ర‌గా న‌టించిన సినిమా అల్లుడు అదుర్స్ కోసం రూ.2.5 కోట్లు తీసుకున్నార‌ట‌. అయితే బాల‌య్య అఖండ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించేందుకు సోనూసూద్ ను సంప్ర‌దించ‌గా ఆయ‌న టీం కు షాక్ ఇచ్చార‌ట‌. ఏకంగా రూ. 7కోట్ల రెమ్యున‌రేష‌న్ ను డిమాండ్ చేశార‌ట‌. దాంతో అఖండ చిత్ర యూనిట్ అంత ఇచ్చేందుకు వెన‌క‌డుగు వేసింద‌ట‌. ఇక సోనూ సూద్ భారీగా డిమాండ్ చేయ‌డంతో అఖండ టీం ప్ర‌స్తుతం వేరే వాళ్ల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డార‌ట‌. 

ఇదిలా ఉండ‌గా గ‌త కొద్ది రోజుల నుండి సోనూ త‌న రెమ్యున‌రేష‌న్ ను పెంచార‌ని ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఆయ‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను బ‌ట్టి చూస్తే ఆయ‌న‌కు ఏడు కోట్ల రెమ్యున‌రేషన్ ఇవ్వొచ్చ‌నే విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. దానికి కార‌ణం ఆయ‌న్ను చూసి కూడా సినిమాకు వ‌చ్చే ప్రేక్ష‌కులు ఉన్నార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Related Stories