English   

పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ఎన్టీఆర్

NTR
2021-06-02 15:16:19

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందని తెలియగానే అందరి దృష్టి ఈ సినిమాపైనే పడింది. మైత్రీ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఇటీవలే కథా చర్చలు ముగిశాయని, పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున ఈ సినిమాను రూపొందించనున్నారని అంటున్నారు. అయితే ఇందులో ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా చూపించి థియేటర్స్‌లో నందమూరి అభిమానుల చేత గోల పెట్టించేలా స్కెచ్చేశారట కేజీఎఫ్ డైరెక్టర్.

ఎప్పుడైతే ఈ మూవీ ఉంటుందని తెలిసిందో అప్పటినుంచే ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ విషయమై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రపంచాన్నే గడగడలాడించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నారని, అలాగే జవాన్‌గా తారక్ కనిపించబోతున్నారని రకరకాలుగా చెప్పుకున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఆయనను పవర్ ఫుల్ పొలిటీషియన్‌ చూపించాలని ప్రశాంత్ నీల్ ఫిక్సయినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లు కథ కూడా సిద్ధం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
 

More Related Stories