English   

మ‌హేశ్ బాబు సినిమాకు విల‌న్ దొరికేశాడా

Arjun Sarja
2021-06-02 15:38:35

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ ను దుబాయ్ లో నెల రోజుల పాటు చిత్రించారు. అంతే కాకుండా దుబాయ్ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రించారు. దుబాయ్ షెడ్యూల్ తరవాత హైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్ షూటింగ్ మొదలు పెట్టగానే కరోనా విజృంభణ మొదలైంది. దాంతో షూటింగ్ ను వాయిదా వేశారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమాలో విలన్ ఎవరనేదానిపై కన్ఫ్యూజన్  కొనసాగుతూనే ఉంది. విలన్ గా నటించేందుకు పలువురిపేర్లు వినిపించాయి. అయితే తాజాగా సినిమాలో విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో అర్జున్ ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానున్నట్టు సమాచారం. అర్జున్ ఇప్పటివరకు పలు చిత్రాల్లో విలన్ గా నటించడం తో పాటు కొన్ని సినిమాల్లో కీ రోల్స్ చేశారు. ఇక మహేష్ బాబుకు విలన్ గా ఎంతమేరకు అలరిస్తారో చూడాలి.

More Related Stories